పరకాలలో మహిళ హత్య కేసు ఛేదింపు
పరకాల, అక్టోబర్ 4 (ప్రజానేస్తం జ్వాల):హనుమకొండ జిల్లా పరకాల మండల కేంద్రంలోని ఆకులవాడలో ఇటీవల చోటుచేసుకున్న మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. రాంనగర్‌కు చెందిన నేరెళ్ల రమేష్ (38)ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి రెండు బంగారు పుస్తెలు, హత్యకు ఉపయోగించిన ఇనుప రాడ్, రక్తపు మరకలు ఉన్న దుస్తులను స్వాధీనం చేసుకున్నారు.పరకాల ఏసీపీ సతీష్‌బాబు తెలిపిన వివరాల ప్రకారం. సెప్టెంబర్ 30 అర్ధరాత్రి ఆకులవాడలోని ఓ ఇంట్లోకి నిందితుడు పైకప్పు మార్గం ద్వారా చొరబడ్డాడు. ఇంట్లో ఉన్న మహిళలు అతడిని గమనించి కేకలు వేయడంతో వారిపై ఇనుప రాడ్‌తో దాడి చేశాడు. ఈ ఘటనలో కోడెల సుగుణ మృతి చెందగా,...