సంప్రదాయబద్ధంగా దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించాలి
కీతవారిగూడెం: శ్రీ దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలను సంప్రదాయబద్ధంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని కీతవారిగూడెం అయ్యగారు బ్రహ్మశ్రీ రాయప్రోలు శ్రీరామయ్య శర్మ , భద్రయ్య శర్మ నవరాత్రి ఉత్సవ కమిటీలకు సూచించారు. అమ్మవారి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పది రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాలను శాస్త్రోక్తంగా చేపట్టాలని వారు కోరారు. ఆలయాలు, మండపాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొల్పడంతో పాటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. నవరాత్రుల్లో ఆయా రోజులకు అనుగుణంగా అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీ అని తెలిపారు. భక్తి, సంప్రదాయం, ఆధ్యాత్మికతకు ప్రాధాన్యమిస్తూ ఉత్సవాలను నిర్వహించాలని నవరాత్రి కమిటీలకు పిలుపునిచ్చారు.అమ్మవారి కృపతో గ్రామాల్లో సుఖశాంతులు, సౌభాగ్యం, ఆయురారోగ్యాలు...