ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత

ప్రముఖ దర్శకుడు, భారతీయ సినీ రంగంలో వినూత్న ప్రయోగాలకు మారుపేరుగా నిలిచిన సింగీతం శ్రీనివాసరావు (94) కన్నుమూశారు. కొంతకాలంగా వయోభారంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. తెలుగు సినీ పరిశ్రమతో పాటు భారతీయ చలనచిత్ర రంగంలో సింగీతం శ్రీనివాసరావు తనదైన ముద్ర వేశారు. ‘పుష్పక విమానం’, ‘ఆదిత్య 369’, ‘భైరవద్వీపం’, ‘మయూరి’ వంటి విభిన్న చిత్రాలను తెరకెక్కించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ప్రయోగాత్మక కథాంశాలు, వినూత్న కథనం ఆయన చిత్రాలకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి. కె.వి.రెడ్డి వద్ద సహాయ దర్శకుడిగా సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన ఆరు దశాబ్దాలకు పైగా కొనసాగిన కెరీర్‌లో 60కి పైగా చిత్రాలకు...