🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 18 November 2026, 7:52 pm Posted by : Praja Nestham Jwala News

ఎదుగుదల.......

News Image
సాధారణ మానవుని నుండి దేవుడు ఎలా ఉంటాడో కనిపెట్టే స్థాయికి ఎదిగాము...
పావులా ఉంటే ప్రశాంతంగా ఉండే జీవితం నుండి పాతిక వేలు ఉన్న ప్రశాంతత లేని స్థాయికి ఎదిగాము..
పాదరక్షల నుండి ప్రపంచాన్ని చుట్టే గాలి మోటార్ వరకు ప్రతిదీ ఎదుగుదలే అనుకుంటున్నారు ఈ జనరేషన్ లో......

నిజానికి ఎదుగుదలంటే...
సాటి మనిషికి కష్టం వస్తే నీకు తోచిన సహాయం చేయడం ఎదుగుదల...
నాణెములను వదిలి నమ్మిన స్నేహం కోసం నిలబడడం ఎదుగుదల...
నూతిలో తోయడం మరిచి, ఆసరాగా నిలవడం నీ ఎదుగుదల...
చేదును మింగి అమృతాన్ని పంచడం నీ ఎదుగుదల...
అక్కరకు రానీ ఆశయాలను దాచి, ఆలోచన విధానాన్ని పెంచడం నీ ఎదుగుదల...
మంచిని పంచిన మహనీయులకు తగిలిన పోటు రౌతుల గాయాన్ని చూసి గతి తప్పక మిత్రమా............
ఆ గాధను తలుచుకొని ఎదిగిన జీవితాలను చూసి సుఖ పడు.......

రచయిత: నాగిల్ల రజినీకాంత్
🏠 Home