🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 18 November 2026, 7:34 pm Posted by : Nagilla Rajinikanth

బియ్యం అక్రమ నిల్వదారులపై పీడీ యాక్ట్ నమోదు చేయాలి

News Image
* రైస్ మిల్లులు, గోదాములపై తక్షణ తనిఖీలు చేపట్టాలి
* సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు ఆదరి శ్రీనివాస్ డిమాండ్

భీమదేవరపల్లి, నవంబర్ 18 (ప్రజానేస్తం జ్వాల): భీమదేవరపల్లి మండలంలోని రైస్ మిల్లులు, బియ్యం గోదాముల్లో అక్రమంగా బియ్యం నిల్వ చేసి బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్న వ్యాపారులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు కామ్రేడ్ ఆదరి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. అక్రమ నిల్వల ద్వారా బియ్యం ధరలను కృత్రిమంగా పెంచుతూ పేద ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని కోరారు.

ఈ మేరకు బుధవారం భీమదేవరపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఐ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టి అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆదరి శ్రీనివాస్ మాట్లాడుతూ మండలంలోని రైస్ మిల్లులు, బియ్యం గోదాములపై రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ అధికారులు తక్షణమే తనిఖీలు నిర్వహించాలని కోరారు. అక్రమంగా నిల్వ చేసిన బియ్యాన్ని గుర్తించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

రేషన్ దుకాణాల ద్వారా కేవలం బియ్యమే కాకుండా పప్పులు, ఉప్పు, నూనెతో పాటు మొత్తం 12 రకాల నిత్యావసర సరుకులను పేద ప్రజలకు పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. బియ్యం అక్రమ నిల్వల విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అధికారులు తక్షణమే స్పందించి అక్రమ బియ్యం నిల్వలను అరికట్టకపోతే సీపీఐ ఆధ్వర్యంలో గోదాముల వద్ద ప్రజా ఉద్యమాలు చేపట్టి అక్రమాలను వెలుగులోకి తీసుకొస్తామని హెచ్చరించారు. పేద ప్రజలకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

ఈ నిరసన కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యురాలు మంచాల రమాదేవి, మండల కార్యదర్శి ఆదరి రమేష్, గట్ల నర్సింగాపూర్ గ్రామ కార్యదర్శి సంజు కుమార్, సహాయ కార్యదర్శి పవన్ పెళ్లి కిషన్, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ గ్రామ కార్యదర్శి దామర సప్న తదితరులు పాల్గొన్నారు.
🏠 Home