డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పక్కనే సెల్ టవర్ నిర్మాణం.. అడ్డుకున్న మహిళలపై దాడి!
అక్రమ నిర్మాణంపై స్థానికుల ఆగ్రహం.. అధికారుల జోక్యం చేసుకోవాలని డిమాండ్
జవహర్‌నగర్, నవంబర్ 18 (ప్రజానేస్తం జ్వాల): జవహర్‌నగర్ పరిధిలోని బాలాజీనగర్ ఆదర్శనగర్ కాలనీ ఫేజ్-2లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల సమీపంలో చేపట్టిన సెల్ టవర్ నిర్మాణం తీవ్ర వివాదానికి దారితీసింది. స్థానికులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా, అవసరమైన అనుమతులపై స్పష్టత లేకుండానే నిర్మాణ పనులు చేపడుతున్నారని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ, నోటరీ స్థలంలో సెల్ టవర్ ఏర్పాటు చేస్తున్నారనే సమాచారంతో అప్రమత్తమైన డబుల్ బెడ్‌రూమ్ నివాసితులు నిర్మాణ పనులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పనులు నిలిపివేయాలని కోరిన మహిళలపై టవర్ నిర్మాణానికి సంబంధించిన పూజారి, ఆయన కుమారుడు దాడికి పాల్పడ్డారని స్థానికులు ఆరోపించారు. ఈ ఘటనతో కాలనీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఇప్పటికే జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ కారణంగా గాలి, నీటి కాలుష్యంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఇప్పుడు నివాస ప్రాంతం పక్కనే సెల్ టవర్ ఏర్పాటు చేయడం మరింత ఆందోళన కలిగిస్తోందని ప్రజలు పేర్కొన్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధుల ఆరోగ్యంపై ప్రభావం పడుతుందనే భయాందోళన వ్యక్తం చేశారు. మహిళలపై దాడికి పాల్పడిన వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని, సెల్ టవర్ నిర్మాణానికి సంబంధించిన అనుమతులను అధికారులు పరిశీలించాలని కాలనీవాసులు డిమాండ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం జరుగుతున్నట్లు తేలితే వెంటనే పనులు నిలిపివేసి, నివాసితుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.