🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 18 November 2026, 7:27 pm Posted by : Marelli kiran

ప్రతి కుటుంబానికి జీవిత బీమా కల్పించాలి

News Image
హనుమకొండ, నవంబర్‌ 18 (ప్రజానేస్తం జ్వాల): రాష్ట్రంలోని ప్రతి అర్హమైన కుటుంబానికి జీవిత బీమా రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజూ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేయనున్న ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పథకానికి సంబంధించి బుధవారం సచివాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ పాల్గొన్నారు.

నవంబర్‌ 19న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించనున్న నేపథ్యంలో, రాష్ట్రవ్యాప్తంగా రెండు వారాల పాటు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని సీఎస్ సూచించారు. ఇందులో భాగంగా అన్ని గ్రామాలు, మున్సిపల్ వార్డుల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి అర్హులైన కుటుంబాల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని ఆదేశించారు. బీమా పథకం అమలులో ఎలాంటి అర్హులైన కుటుంబాలు మిగిలిపోకుండా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. ప్రతి కుటుంబానికి బీమా రక్షణ అందేలా సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు.
🏠 Home