🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 18 November 2026, 7:26 pm Posted by : Marelli kiran

హెచ్‌ఐవీ నియంత్రణలో హనుమకొండకు ‘సురక్షిత్ జిల్లా’ గుర్తింపు

News Image
హనుమకొండ, నవంబర్‌ 18 (ప్రజానేస్తం జ్వాల): హెచ్‌ఐవీ, ఎయిడ్స్ నివారణ, నియంత్రణ కార్యక్రమాల అమలులో జాతీయ లక్ష్యాలను సమర్థవంతంగా సాధించిన హనుమకొండ జిల్లాకు ప్రతిష్టాత్మక ‘సురక్షిత్ జిల్లా’ గుర్తింపు లభించింది. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (నాకో) నిర్దేశించిన 95-95-95 లక్ష్యాల సాధనలో జిల్లా కనబరిచిన ప్రగతికి ఈ గుర్తింపు దక్కింది.

ఈ సందర్భంగా బుధవారం జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్‌ను తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (టీఎస్‌ఏసీఎస్) డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఇందిర శాలువా, జ్ఞాపికతో ఘనంగా సన్మానించారు. ఈ గుర్తింపు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది సమష్టి కృషికి దక్కిన ఫలితమని కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ పేర్కొన్నారు. హెచ్‌ఐవీ పరీక్షలు, చికిత్స, వ్యాధి నియంత్రణ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. ఇదే స్ఫూర్తితో పనిచేసి భవిష్యత్తులో హనుమకొండ జిల్లాను ‘సురక్షిత్ ప్లస్’ స్థాయికి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
🏠 Home