🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 18 November 2026, 7:25 pm Posted by : Marelli kiran

దోమల నివారణకు డ్రోన్లతో మందుల పిచికారీ.. జీడబ్ల్యూఎంసీ వినూత్న చర్యలు

News Image
హనుమకొండ, నవంబర్‌ 18 (ప్రజానేస్తం జ్వాల): గ్రేటర్ వరంగల్ నగరంలో దోమల బెడదను తగ్గించి ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు జీడబ్ల్యూఎంసీ ఆధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. నగరంలోని 66 డివిజన్ల పరిధిలో దశలవారీగా డ్రోన్ల సహాయంతో నాలాల్లో లార్వా నాశక మందులను పిచికారీ చేయనున్నట్లు జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న తెలిపారు.

బుధవారం హనుమకొండ నయీంనగర్‌లోని రాజాజీ నాలా వద్ద డ్రోన్ల ద్వారా మందుల పిచికారీ పనులను కమిషనర్ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మనుషులు వెళ్లలేని ఇరుకైన నాలాల్లో సైతం డ్రోన్ల సహాయంతో సులభంగా మందులు పిచికారీ చేయవచ్చని పేర్కొన్నారు. ఈ విధానం ద్వారా దోమల లార్వా ఉత్పత్తిని నియంత్రించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎంహెచ్‌వో డాక్టర్ రాజారెడ్డి, ఇతర మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
🏠 Home