పోచంపల్లి ఫౌండేషన్‌తో పరకాల వైకుంఠధామం ఆధునీకరణ
పరకాల, నవంబర్ 18 (ప్రజానేస్తం జ్వాల): పరకాల పట్టణంలోని వైకుంఠధామాన్ని ఆధునిక వసతులతో అభివృద్ధి చేసేందుకు వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ, శాసనమండలి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ముందుకొచ్చారు. తన ఆధ్వర్యంలోని పోచంపల్లి ఫౌండేషన్ ద్వారా కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) నిధులతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ మేరకు పనులకు సంబంధించిన సమగ్ర అంచనాలు సిద్ధం చేయాలని కోరుతూ పరకాల మున్సిపల్ కమిషనర్‌కు లేఖ రాశారు.
2026 సెప్టెంబర్ 5న జరిగిన పరకాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో స్థానిక ప్రజాప్రతినిధులు చేసిన విజ్ఞప్తి మేరకు ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎమ్మెల్సీ పేర్కొన్నారు. తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇప్పటికే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 57వ డివిజన్‌లో ఆధునిక సదుపాయాలతో మోడల్ వైకుంఠధామాన్ని నిర్మించినట్లు తెలిపారు. పరకాల మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు ఆ వైకుంఠధామాన్ని సందర్శించి, అదే తరహాలో పరకాల శ్మశాన వాటిక అభివృద్ధికి అవసరమైన అంచనాలను రూపొందించాలని సూచించారు.
తాను పూర్వపు పరకాల మండలంలోని వరికోలు గ్రామానికి చెందినవాడినని, ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి వివరించారు. అధికారులు వీలైనంత త్వరగా అంచనాలు సమర్పిస్తే, ఫౌండేషన్ ద్వారా నిధులు విడుదల చేసి అభివృద్ధి పనులను ప్రారంభిస్తామని లేఖలో స్పష్టం చేశారు.