సహారా బాధితులకు డిపాజిట్ సొమ్ము వెంటనే చెల్లించాలి: వి. బాలయ్య
హనుమకొండ, నవంబర్ 18 (ప్రజానేస్తం జ్వాల): సహారా ఇండియా సంస్థలో డిపాజిట్ చేసిన ఖాతాదారులకు వారి సొమ్మును తక్షణమే తిరిగి చెల్లించాలని సహారా బాధితుల, కార్యకర్తల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి. బాలయ్య కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. బుధవారం గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా సుమారు 13 కోట్ల మంది సహారా బాధితులు తమ డిపాజిట్ డబ్బుల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారని తెలిపారు.
కష్టపడి సంపాదించిన సొమ్మును పొదుపు చేసుకున్నప్పటికీ సకాలంలో తిరిగి అందక ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డిపాజిట్ సొమ్ము అందక లక్షలాది మంది ఖాతాదారులతో పాటు ఏజెంట్లు కూడా ఆర్థిక, మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వాలు వెంటనే స్పందించి ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని, అర్హులైన బాధితులందరికీ డిపాజిట్ సొమ్ము తిరిగి అందించి న్యాయం చేయాలని వి. బాలయ్య కోరారు.