🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 18 November 2026, 7:13 pm Posted by : Marelli kiran

వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో 2,698 మందికి చేయూత పింఛన్లు మంజూరు

News Image
హనుమకొండ, నవంబర్‌ 18 (ప్రజానేస్తం జ్వాల): వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని అర్హులైన నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం 2,698 కొత్త చేయూత ఆసరా పింఛన్లను మంజూరు చేసింది. ఈ మేరకు బుధవారం హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రం ప్రాంగణంలో లబ్ధిదారులకు పింఛన్ మంజూరు పత్రాలను పంపిణీ చేశారు.

పంపిణీ కార్యక్రమం కోసం వివిధ డివిజన్ల వారీగా ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన లబ్ధిదారులు పింఛన్ మంజూరు పత్రాలను అందుకుని సంతోషం వ్యక్తం చేశారు.

లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బల్దియా అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేపట్టారు. కొత్తగా పింఛన్లు మంజూరు కావడంతో అర్హులైన పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా లభించనుంది.
🏠 Home