డంపింగ్ యార్డు భూతానికి మరో పసి బాలిక బలి!
జవహర్‌నగర్, నవంబర్ 18 (ప్రజానేస్తం జ్వాల): జవహర్‌నగర్ డంపింగ్ యార్డు నుంచి వెలువడుతున్న విషవాయువుల కారణంగానే 14 ఏళ్ల బాలిక ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతూ మృతి చెందిందని డంపింగ్ యార్డు ఎత్తివేత పోరాట కమిటీ ఆరోపించింది. బాలిక మృతికి డంపింగ్ యార్డు కాలుష్యమే కారణమని కమిటీ ప్రతినిధులు అనుమానం వ్యక్తం చేస్తూ, బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారిన రాంకీ చెత్త డంపింగ్ యార్డును వెంటనే ఎత్తివేయాలని కోరారు.
కీసర సర్కిల్ పరిధిలోని జవహర్‌నగర్ జీహెచ్‌ఎంసీ ప్రాంతంలో రాంకీ గేట్ సమీపంలోని శాంతినగర్‌కు చెందిన 14 ఏళ్ల బాలిక ఊపిరితిత్తుల సమస్యతో మరణించినట్లు కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు. బుధవారం (నవంబర్ 18) బాలిక కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు మీడియాకు, జేఏసీ ప్రతినిధులకు ఈ ఘటనకు సంబంధించిన వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారని కమిటీ నాయకులు తెలిపారు. డంపింగ్ యార్డు కాలుష్యంపై మాట్లాడేందుకు కూడా స్థానిక ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారనే అనుమానాలు ఈ ఘటనతో మరింత బలపడుతున్నాయని అన్నారు.
డంపింగ్ యార్డు పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు విషవాయువులు, కాలుష్య సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కమిటీ ప్రతినిధులు ఆరోపించారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధుల ఆరోగ్యంపై కాలుష్య ప్రభావం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో చోటుచేసుకుంటున్న అనారోగ్య సమస్యలు, మరణాలపై ప్రభుత్వం సమగ్ర అధ్యయనం చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కోరారు.
మృతిచెందిన బాలిక కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం అందించడంతో పాటు, కుటుంబ సభ్యులకు అవసరమైన అన్ని విధాలా అండగా నిలవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డంపింగ్ యార్డు కాలుష్యంపై స్వతంత్ర విచారణ జరిపించి, ప్రజల ఆరోగ్య పరిరక్షణకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. ఈ డిమాండ్లను మాజీ కార్పొరేటర్ సుబ్రహ్మణ్యం, బీఎన్‌ఆర్‌కేఎస్‌కు చెందిన సూర వెంకటయ్య, ప్రజా నాట్యమండలి వెంకటాచారి, పీఓడబ్ల్యూ (విముక్తి)కు చెందిన గడిపే సునీత, ఆవుల దుర్గేష్, మంజుల, సునీల్, నందిని తదితరులు వ్యక్తం చేశారు.