🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 18 November 2026, 11:28 am Posted by : Praja Nestham Jwala News

పెద్దమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన కడియం శ్రీహరి

News Image
ధర్మసాగర్, నవంబర్ 18 (ప్రజానేస్తం జ్వాల): హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం నారాయణగిరి గ్రామంలో నిర్వహించిన పెద్దమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవాల్లో తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు వేదాశీర్వచనం అందించి ఆశీర్వదించారు. అనంతరం గ్రామస్తులు, నాయకులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ కార్యక్రమంలో ధర్మసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, తాటికాయల మాజీ సర్పంచ్ పెసరు రమేష్, నారాయణగిరి సర్పంచ్ రేణుక, రామిరెడ్డి, రాపాకపల్లి సర్పంచ్ జయందర్, ధర్మసాగర్ సర్పంచ్ మాచర్ల జ్యోతి, ఏలీయా, ముప్పారం సర్పంచ్ రేణుకతో పాటు పరిసర గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
🏠 Home