🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 18 November 2026, 9:00 am Posted by : Praja Nestham Jwala News

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి ఈ నెల 19 నుంచి దరఖాస్తుల స్వీకరణ

News Image
ప్రతి అర్హ కుటుంబానికి రూ.5 లక్షల బీమా రక్షణ: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్

నాగర్‌కర్నూల్, నవంబర్ 18 (ప్రజానేస్తం జ్వాల): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 19 నుంచి ప్రారంభం కానుంది. ఈ పథకం ద్వారా ప్రతి అర్హ కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా రక్షణ కల్పించనున్నట్లు జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ తెలిపారు.

18 నుంచి 59 సంవత్సరాల వయస్సు కలిగిన వారు ఈ పథకానికి అర్హులని పేర్కొన్నారు. కుటుంబంలో జీవనోపాధికి ప్రధాన ఆధారంగా ఉన్న వ్యక్తిని జీవిత బీమా కోసం ఎంపిక చేసుకోవచ్చని వెల్లడించారు.

అర్హులైన వారు ఆధార్ కార్డు, రేషన్ కార్డులతో సమీప గ్రామ పంచాయతీ లేదా మున్సిపల్ వార్డుల్లో దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. అర్హులైన కుటుంబాలన్నీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
🏠 Home