అర్హులందరికీ న్యాయ సేవలు అందించడమే లక్ష్యం
బండపల్లి, నవంబర్ 17 (ప్రజానేస్తం జ్వాల): జాతీయ న్యాయ సేవా అధికార సంస్థ అమలు చేస్తున్న పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరవేయడమే లక్ష్యంగా 60 రోజుల ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించారు.
తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ ఆదేశాల మేరకు నాగర్‌కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం బండపల్లి గ్రామంలో మంగళవారం జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు జాతీయ న్యాయ సేవా అధికార సంస్థ అందిస్తున్న వివిధ పథకాలపై అవగాహన కల్పించనున్నారు. 60 రోజులపాటు ఇంటింటి సర్వే నిర్వహించి, ఆయా పథకాలకు అర్హులైన వారిని గుర్తించడంతో పాటు, వారికి ప్రభుత్వ పథకాల ద్వారా న్యాయ సేవలు, ఇతర ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోనున్నారు. గ్రామస్థాయిలో ప్రతి అర్హుడికి న్యాయ సహాయం అందుబాటులోకి తీసుకురావడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ తరఫున ప్రభుత్వ న్యాయవాది శ్రీరామ్ ఆర్య, న్యాయ సహాయ స్వచ్ఛంద సేవకులు శ్యామ్, పరశురాములు, గ్రామ ఉపసర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.