ఉపాధి హామీ పనులతో గ్రామీణాభివృద్ధికి బాటలు వేయాలి
కూలీలకు నిరంతర ఉపాధి.. శాశ్వత ఆస్తుల నిర్మాణమే లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్
పంజాగుల, నవంబర్ 17 (ప్రజానేస్తం జ్వాల): కూలీలకు నిరంతరం ఉపాధి కల్పించేలా ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని, గ్రామాల్లో శాశ్వత ఆస్తుల నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అధికారులకు సూచించారు. కల్వకుర్తి మండలం పంజాగుల గ్రామంలో చేపడుతున్న ఉపాధి హామీ పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా పొలం చెరువు నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించారు. పొలం చెరువులు, నీటి సంరక్షణ పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని, ఉపాధి హామీ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని అధికారులకు సూచించారు.
అనంతరం పంజాగుల గ్రామంలో మహిళా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నీడవల సాగు కేంద్రాన్ని పరిశీలించారు. 400 చదరపు మీటర్ల విస్తీర్ణంలో రూ.1.46 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ కేంద్రానికి ప్రభుత్వం 50 శాతం రాయితీ కింద రూ.73 వేల ఆర్థిక సహాయం అందించింది. ప్రస్తుతం నీడవలలో ఆకుకూరలు, దోసకాయ, పెద్ద మిరప, తీగ టమాటా వంటి పంటలను సాగు చేస్తున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళా సంఘాలు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అందిపుచ్చుకోవాలని సూచించారు. నీడవల సాగుతో మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపడటంతో పాటు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు అవకాశం ఉంటుందన్నారు. తక్కువ పెట్టుబడితో నాణ్యమైన దిగుబడులు సాధించేలా మహిళా సంఘాలు సమష్టిగా కృషి చేయాలని తెలిపారు.
ప్రభుత్వ రాయితీ పథకాలపై రైతులు, మహిళా సంఘాలు అవగాహన పెంచుకోవాలని, వ్యవసాయాన్ని ప్రణాళికాబద్ధమైన ఆదాయ వనరుగా తీర్చిదిద్దుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ప్రత్యామ్నాయ సాగు విధానాలపై దృష్టి సారించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలని సూచించారు.