అంటుకట్టడం, తేనెటీగల పెంపకంపై కీతవారిగూడెం రైతులకు అవగాహన
కీతవారిగూడెం, నవంబర్ 17 (ప్రజానేస్తం జ్వాల): రైతులు సంప్రదాయ వ్యవసాయ పద్ధతులతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని అధిక దిగుబడులు, అదనపు ఆదాయం సాధించాలని వ్యవసాయ విద్యార్థినులు సూచించారు. ఏలూరులోని సీహెచ్ఎస్డీ మహిళా కళాశాలకు చెందిన బీఎస్సీ అగ్రికల్చర్ చివరి సంవత్సరం విద్యార్థినులు గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) మార్గదర్శకత్వంలో గ్రామీణ వ్యవసాయ అనుభవ కార్యక్రమంలో భాగంగా కీతవారిగూడెం గ్రామ రైతులకు అంటుకట్టడం, తేనెటీగల పెంపకంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా అంటుకట్టడం (గ్రాఫ్టింగ్) ప్రాముఖ్యత, వివిధ రకాలు, అనుసరించాల్సిన పద్ధతులు, వాటి వల్ల కలిగే ప్రయోజనాలను విద్యార్థినులు రైతులకు వివరించారు. అంటుకట్టడం ద్వారా నాణ్యమైన మొక్కలను అభివృద్ధి చేయడంతో పాటు, తక్కువ సమయంలో మంచి ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. ఈ పద్ధతిని అనుసరించడం వల్ల మొక్కల నాణ్యత పెరగడంతో పాటు అధిక దిగుబడులకు అవకాశం ఉంటుందని వివరించారు. అనంతరం తేనెటీగల పెంపకం (మధుపాలన)పై అవగాహన కల్పించారు. తేనెటీగల పెంపకం ద్వారా తేనెతో పాటు ఇతర ఉత్పత్తులను విక్రయించి అదనపు ఆదాయం పొందవచ్చని తెలిపారు. తేనెటీగలు పంటల్లో పరాగసంపర్క ప్రక్రియకు ఎంతగానో దోహదపడతాయని, తద్వారా పంటల దిగుబడి, నాణ్యత పెరుగుతాయని వివరించారు. తక్కువ పెట్టుబడితో మధుపాలనను అనుబంధ వ్యవసాయ వృత్తిగా చేపట్టడం ద్వారా రైతులు ఆర్థికంగా మరింత బలోపేతం కావచ్చని సూచించారు.
వ్యవసాయంలో నూతన పద్ధతులు, శాస్త్రీయ పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం ద్వారా సాగు ఖర్చులను తగ్గించుకొని మెరుగైన లాభాలు పొందవచ్చని విద్యార్థినులు వివరించారు. కార్యక్రమంలో రైతులు పలు సందేహాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గుండు సతీష్, వెల్పుల రామలింగయ్య, నర్సింగ్, నరేష్, ఎస్.కె. పెరుసాహెబ్, కట్రేవుల వెంకటేష్, ముంత నాగయ్య, ఎల్లావుల రాములు, కట్రేవుల నర్సయ్య, సనగాని వెంకటేష్, బడేటి వినయ్, దాసరి సైదులు, పిల్లి యాదగిరి, బొల్లెపల్లి పాపయ్య తదితర రైతులు పాల్గొన్నారు. బీఎస్సీ అగ్రికల్చర్ చివరి సంవత్సరం విద్యార్థినులు ఎం. నవ్యశ్రీ, వై. మనీషా, పి. హేమలత, ఐ. సత్యజ్యోతి, వై. సౌమ్య, ఆర్. మోనిక కార్యక్రమాన్ని నిర్వహించారు.