🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 18 November 2026, 7:47 am Posted by : Marelli kiran

మామునూరు పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన వరంగల్ సీపీ ఎన్. శ్వేత

News Image
వరంగల్, నవంబర్ 17 (ప్రజానేస్తం జ్వాల): వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ మంగళవారం మామునూరు పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని వివిధ రికార్డులు, పెండింగ్ కేసుల వివరాలు, కేసుల దర్యాప్తు పురోగతిని క్షుణ్ణంగా పరిశీలించారు. స్టేషన్ పరిసరాలు, రికార్డుల నిర్వహణ, పోలీస్ సిబ్బంది విధుల నిర్వహణ తీరును సమీక్షించి పలు సూచనలు చేశారు. ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని సీపీ సూచించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే స్పందించాలని ఆదేశించారు.

పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, నాణ్యమైన దర్యాప్తు ద్వారా బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. విధుల పట్ల అప్రమత్తంగా ఉంటూ క్రమశిక్షణ, అంకితభావం, బాధ్యతతో పనిచేయాలని పోలీస్ సిబ్బందికి సూచించారు. అదేవిధంగా డ్రగ్స్ అక్రమ రవాణా, వినియోగంపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మాదకద్రవ్యాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడంతో పాటు అనుమానితుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని తెలిపారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి పోలీస్ శాఖ సమన్వయంతో కృషి చేయాలని సీపీ సూచించారు.

ఈ ఆకస్మిక తనిఖీలో ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్, పర్వతగిరి సీఐ ఆర్. సంతోష్ కుమార్, మామునూరు ఇన్‌స్పెక్టర్ ఈ. శ్రీనివాస్ తదితర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
🏠 Home