🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 18 November 2026, 7:46 am Posted by : Amruth Varma Bolugoddu

వరంగల్ రంగశాయిపేటలో విషాదం.. దంపతుల ఆత్మహత్య

News Image
వరంగల్, నవంబర్ 17 (ప్రజానేస్తం జ్వాల): వరంగల్ నగరంలోని రంగశాయిపేటలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. శోభ, సంజయ్ అనే దంపతులు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం.. దంపతులు ముందుగా తమ పెంపుడు కుక్కను చంపిన అనంతరం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.

కుటుంబంలో తలెత్తిన కలహాలే ఈ ఘటనకు కారణమై ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలిస్తున్నారు. దంపతుల ఆత్మహత్యకు గల అసలు కారణాలపై దర్యాప్తు చేపట్టాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
🏠 Home