అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పెన్షన్లు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం
కీసర సర్కిల్ పరిధిలో 2,500 మందికి నూతనంగా చేయూత పెన్షన్లు మంజూరు
జవహర్నగర్, నవంబర్ 17 (ప్రజానేస్తం జ్వాల):అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పెన్షన్లు అందించడమే తెలంగాణ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన చేయూత పెన్షన్ల ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం దమ్మాయిగూడలోని సాయి భవాని ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా తోటకూర వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ, ఆపదలో ఉన్న ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలనే సదుద్దేశంతో ఈ నెల 19వ తేదీ నుంచి రాష్ట్రంలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు మధ్య ఉన్న కుటుంబ యజమానికి రూ.5 లక్షల బీమా సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించనుందని వివరించారు.
రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 4 లక్షల 63 వేల మందికి చేయూత పెన్షన్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. ఇందుకోసం ప్రభుత్వంపై ప్రతి నెలా అదనంగా రూ.114 కోట్ల ఆర్థిక భారం పడుతున్నప్పటికీ అర్హులైన పేదలకు సంక్షేమ ఫలాలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో కొత్తగా 2,553 చేయూత పెన్షన్లు మంజూరు కాగా, కీసర సర్కిల్ పరిధిలో సుమారు 2,500 మందికి నూతనంగా పెన్షన్లు మంజూరైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా కీసర సర్కిల్ పరిధిలోని లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు ఉత్తర్వులను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్, రాష్ట్ర నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరై లబ్ధిదారులకు మంజూరు ఉత్తర్వులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహులు యాదవ్, చంద్రపురి కాలనీ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్, స్థానిక నాయకులు కారింగుల శంకర్ గౌడ్, గొడుగు వేణు, రజిత గోపాల్, మాట్లా శ్రీనివాస్, బూడిద వెంకటేష్, చిట్టిబాబు, కారింగుల రాజు గౌడ్, మంజుల, సుగుణ, కాలేశా, రేసు లక్ష్మి, సరిత, భాస్కర్, రాహుల్ కదం, బబ్లూ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.