'అక్వాన్' తుఫాన్ ప్రభావం.. తెలంగాణలో భారీ నుంచి అతిభారీ వర్షాలు!
హనుమకొండ, నవంబర్ 17 (ప్రజానేస్తం జ్వాల): బంగాళాఖాతంలో ఏర్పడిన 'అక్వాన్' (Akvan) తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో ఈ నెల 20, 21 తేదీల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. వాతావరణ శాఖ తాజా హెచ్చరికల ప్రకారం నవంబర్ 20న భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలకు భారీ నుంచి అతిభారీ వర్షాల నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ములుగు, నల్గొండ, జనగామ, యాదాద్రి భువనగిరి, వరంగల్, హనుమకొండ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది.
అలాగే నవంబర్ 21న జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలోనూ భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తుఫాన్ ఈ నెల 20వ తేదీ మధ్యాహ్నం నెల్లూరు నుంచి విశాఖపట్నం మధ్య ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటే అవకాశం ఉందని అంచనా వేసింది.
ప్రజలు వాతావరణ శాఖ సూచనలను పాటించాలని, రైతులు, మత్స్యకారులు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాల సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో ఆశ్రయం పొందవద్దని సూచిస్తున్నారు.