🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 18 November 2026, 7:36 am Posted by : Nagilla Rajinikanth

మాట...!

News Image
అక్షరాలు రెండే అయినా..
నాలుగు అక్షరాల జీవితాన్ని ముందుకు నడిపించే శక్తి మాటకు ఉంది!

కడుపునిండా అన్నం పెట్టించేది మాటే..
అదే కడుపును ఖాళీ చేసేది కూడా మాటే!

ముఖంపై చిరునవ్వులు పూయించేది మాటే..
అదే ముఖాన్ని చింతలో ముంచేది కూడా మాటే!

యుద్ధం మొదలయ్యేలా చేసేది మాటే..
రాయబారిగా మారి యుద్ధాన్ని ఆపేది కూడా మాటే!

మమకారాన్ని చూపించే మాటే..
మూర్ఖత్వాన్ని బయటపెట్టే మాటగా కూడా మారుతుంది!

అక్కరకు రాని బంధువు కంటే..
అరక్షణం అవసరమైనప్పుడు పలికే మాటే గొప్పది!

ఎందుకంటే...

అమ్మ చెప్పిన మాటే కదా..
పంచ పాండవులకు ద్రౌపదిని భార్యగా చేసింది!

పొరపాటున పలికిన మాటే కదా..
మహాభారత యుద్ధానికి కారణమైంది!

మాటకు మనిషిని కలిపే శక్తి ఉంది..
మనుషుల మధ్య దూరాన్ని పెంచే శక్తి కూడా ఉంది!

అందుకే మాటను ఆచితూచి మాట్లాడాలి..
ఎందుకంటే పలికిన మాట వెనక్కి తీసుకోలేం!

మనిషి నిజ జీవితంలో నిలదొక్కుకోవడానికి మాట ఎంతో అవసరం..
కానీ ఆ మాటలో నిజాయితీ, ప్రేమ, గౌరవం ఉండాలి!

మాట చిన్నదే కావచ్చు..
కానీ దాని ప్రభావం జీవితకాలం ఉంటుంది!

— నాగిల్ల రజినీకాంత్
🏠 Home