ఈనెల 19 నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం
* అర్హులైన ప్రతి కుటుంబం దరఖాస్తు చేసుకోవాలి.. డిసెంబర్ 20 వరకు గడువు
* కుటుంబ పెద్ద మరణిస్తే రూ.5 లక్షల బీమా పరిహారం
సూర్యాపేట, నవంబర్ 17 (ప్రజానేస్తం జ్వాల): కుటుంబాన్ని పోషించే వ్యక్తి మరణించినప్పుడు ఆ కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అమలు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. ఈనెల 19వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకం ప్రారంభం కానుందని, జిల్లాలోని ప్రతి కుటుంబం ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. నవంబర్ 19 నుంచి డిసెంబర్ 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు వెల్లడించారు. ఈ పథకం అమలుపై సోమవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పథకం అర్హతలు, దరఖాస్తుల స్వీకరణ, నమోదు ప్రక్రియ, అధికారుల బాధ్యతలపై పలు సూచనలు చేశారు.
18 నుంచి 59 ఏళ్ల వయసున్న కుటుంబ పోషకులకు అర్హత
కుటుంబాన్ని పోషించే వ్యక్తి 18 నుంచి 59 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలని కలెక్టర్ తెలిపారు. ఆ వ్యక్తి మరణించినట్లయితే కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా పరిహారం అందుతుందని వివరించారు. పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రతి కుటుంబం ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉన్న కుటుంబాలతో పాటు రేషన్ కార్డు లేని కుటుంబాలకు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించినట్లు తెలిపారు.
ఎలాంటి ఫీజులు, ప్రీమియం అవసరం లేదు
ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు ఎలాంటి చార్జీలు, ఫీజులు లేదా ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. కేవలం దరఖాస్తు చేసుకుంటే సరిపోతుందని తెలిపారు. వయస్సు ధ్రువీకరణకు ఆధార్ కార్డు సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కుటుంబాన్ని పోషించే వ్యక్తి బీమా పొందే వ్యక్తిగా, కుటుంబ సభ్యులు నామినీలుగా ఉంటారని వివరించారు. ఒకరి కంటే ఎక్కువ మంది నామినీలను పేర్కొనే అవకాశం ఉందని తెలిపారు.
గ్రామ, వార్డు కార్యాలయాల్లో దరఖాస్తుల స్వీకరణ
ప్రతి గ్రామపంచాయతీ కార్యాలయంలో, మున్సిపల్ వార్డు కార్యాలయాల్లో దరఖాస్తుల స్వీకరణకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి కేంద్రానికి ఒక ఇన్‌చార్జిని నియమించాలని, మూడు నుంచి నాలుగు క్లస్టర్లకు ఒక సూపర్‌వైజర్‌ను నియమించి గ్రామాల వారీగా పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. ఎంపీడీవోలు, ఎంఈఓలు, తహసీల్దార్లు, ఏఈపీఆర్, ఆర్‌డబ్ల్యూఎస్, ఎంపీవోలు పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహించాలని తెలిపారు.
రేషన్ కార్డు ఆధారంగా దరఖాస్తులో కుటుంబ వివరాలు ముందుగానే నమోదై ఉంటాయని, వాటిని జాగ్రత్తగా పరిశీలించి కుటుంబ పోషకుడు, నామినీ వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు. నామినీ మైనర్‌గా ఉన్నట్లయితే బీమా పొందే వ్యక్తి సమ్మతితో మరో వ్యక్తిని నామినీగా ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు.
దరఖాస్తుతో పాటు రేషన్ కార్డు, ఆధార్ కార్డు జతచేయాలని, సంబంధిత పత్రాలను మొబైల్ యాప్ లేదా వెబ్ పోర్టల్ ద్వారా అప్‌లోడ్ చేయాలని పేర్కొన్నారు. దరఖాస్తుల హార్డ్ కాపీలను ఎంపీడీవో కార్యాలయాల్లో భద్రపరచాలని ఆదేశించారు. దరఖాస్తుదారుల నుంచి ప్రత్యేక ఫొటోలు లేదా అదనపు డిక్లరేషన్లు తీసుకోవాల్సిన అవసరం లేదని, దరఖాస్తు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉంటే సరిపోతుందని స్పష్టం చేశారు.
ప్రతి కుటుంబానికి పథకంపై అవగాహన కల్పించాలి
జిల్లాలోని అన్ని గ్రామాలు, మున్సిపాలిటీల్లో పథకంపై విస్తృత ప్రచారం నిర్వహించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో టామ్‌టామ్ ద్వారా ప్రచారం చేపట్టి ప్రతి కుటుంబానికి సమాచారం చేరవేయాలని సూచించారు. నవంబర్ 19 నుంచి డిసెంబర్ 20 వరకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను పూర్తి చేయాలని, మండల ప్రత్యేక అధికారులు ప్రతిరోజూ స్వయంగా పర్యవేక్షించాలని తెలిపారు. జిల్లావ్యాప్తంగా అన్ని గ్రామాలు, మున్సిపాలిటీల్లో ఒకేసారి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని ఆదేశించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ బి. హరి సింగ్, జెడ్పీ సీఈఓ శిరీష, సీపీఓ కిషన్, మున్సిపల్ కమిషనర్ హనుమంత్ రెడ్డి, జిల్లా క్రీడల అధికారి వెంకట్ రెడ్డి, డీఎల్పీవో తదితరులు పాల్గొన్నారు.