🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 17 November 2026, 2:51 pm Posted by : Nagaraju Golla

చర్లపల్లి పాఠశాలలో విద్యార్థులకు ఉచిత వైద్య పరీక్షలు

News Image
హనుమకొండ, నవంబర్ 17 (ప్రజానేస్తం జ్వాల): నడికూడ మండలం చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో మంగళవారం విద్యార్థులకు ఉచిత వైద్య ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యురాలు డాక్టర్ సంధ్య విద్యార్థులకు జనరల్ హెల్త్ చెకప్ నిర్వహించి, అవసరమైన సూచనలు, మందులు అందించారు. విద్యార్థులకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పిస్తూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, కాచి చల్లార్చిన నీటిని తాగాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అచ్చ సుదర్శన్ మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ఇలాంటి శిబిరాలు ఎంతో ఉపయోగకరమని పేర్కొని డాక్టర్ సంధ్యకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు లకవద్దేవా, కంచ రాజ్‌కుమార్, పుల్లూరి రామకృష్ణ, బండి శ్వేత, ఏఎన్‌ఎం కవిత, విద్యార్థులు పాల్గొన్నారు.
🏠 Home