సాయినగర్‌లో ఆధ్యాత్మిక వైభవం.. పోచమ్మ ఆలయం ప్రారంభం, బొడ్రాయి ప్రతిష్ఠాపన
భీమదేవరపల్లి, నవంబర్ 16 (ప్రజానేస్తం జ్వాల): హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం సాయినగర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన పోచమ్మ ఆలయ ప్రారంభోత్సవం, బొడ్రాయి ప్రతిష్ఠాపన మహోత్సవం సోమవారం భక్తిశ్రద్ధలతో, అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక వేడుకలకు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వేదపండితుల మంత్రోచ్ఛారణలు, ఆశీర్వచనాల మధ్య ఆలయ ప్రారంభోత్సవం, బొడ్రాయి ప్రతిష్ఠాపన కార్యక్రమాలు సంప్రదాయబద్ధంగా జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ భక్తిశ్రద్ధలతో పూజల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలతో గ్రామం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.
గ్రామంలో ఇంతటి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడంలో భాగస్వాములైన సర్పంచ్, ఉపసర్పంచ్, గ్రామ పెద్దలు, ప్రజలకు మంత్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ వేడుకలతో సాయినగర్ గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. పెద్ద సంఖ్యలో గ్రామస్థులు, భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.