డిసెంబర్ 9న చలో హైదరాబాద్.. ఆదివాసీ అస్తిత్వ సభను విజయవంతం చేయాలి
నార్నూర్, నవంబర్ 16 (ప్రజానేస్తం జ్వాల): ఆదివాసీల హక్కులు, అస్తిత్వం, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ కోసం డిసెంబర్ 9న హైదరాబాద్‌లో నిర్వహించనున్న ఆదివాసీ అస్తిత్వ సభకు పెద్ద సంఖ్యలో తరలిరావాలని తుడుందెబ్బ నాయకులు పిలుపునిచ్చారు. ఈ సభకు సంబంధించిన కరపత్రాలను సోమవారం నార్నూర్ మండల కేంద్రంలోని కుమ్రం భీం విగ్రహం వద్ద తుడుందెబ్బ నాయకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆదివాసీల హక్కులు, అస్తిత్వం, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ కోసం నిర్వహిస్తున్న ఈ సభలో ఆదివాసీ ప్రజలు స్వచ్ఛందంగా పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ప్రతి గ్రామంలోని ఆదివాసీ నాయకులు, పటేళ్లు, యువకులు, మహిళలు, ప్రజాప్రతినిధులు సమిష్టిగా కృషి చేసి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఆదివాసీల ఐక్యతను చాటుతూ డిసెంబర్ 9న హైదరాబాద్‌లో జరిగే ఆదివాసీ అస్తిత్వ సభలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. ఆదివాసీ సమాజ హక్కుల పరిరక్షణకు ఐక్యంగా ముందుకు రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ ఉట్నూర్ డివిజన్ అధ్యక్షుడు కనక ప్రభాకర్, నార్నూర్ మండల అధ్యక్షుడు ఆడ శ్రీరామ్, ఆదివాసీ విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెందోర్ దీపక్, తుడుందెబ్బ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మెస్రం మోతిరాం, నార్నూర్ మండల గౌరవ అధ్యక్షుడు మాడవి మాణికరావు, ఆదివాసీ విద్యార్థి సంఘం మండల గౌరవ అధ్యక్షుడు పెందోర్ కృష్ణ, తుడుందెబ్బ సలహాదారు పెందోర్ విట్టల్, జిల్లా నాయకుడు పూసం ఈశ్రు, మండల ప్రచార కార్యదర్శి ఆత్రం రమేష్, జాండా సర్పంచ్ మెస్రం చందు, సుంగాపూర్ సర్పంచ్ పెందోర్ లక్ష్మణ్, బాబేజారి సర్పంచ్ పెందోర్ లింగు, దేవారిగూడ సర్పంచ్ కుంరం రాహుల్, ఆదివాసీ నాయకులు సేద్మకి భీంరావ్, మాడవి గోదృతో పాటు పలువురు ఆదివాసీ పెద్దలు పాల్గొన్నారు.