🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 17 November 2026, 8:01 am Posted by : Praja Nestham Jwala News

కెరమెరి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ నితికా పంత్

News Image
ప్రజలకు నాణ్యమైన పోలీస్ సేవలు అందించాలి.. విధుల్లో నిర్లక్ష్యానికి తావివ్వకూడదు
గుడుంబా, పేకాట, బెట్టింగ్, గంజాయి విక్రయాలు, అక్రమ రవాణాపై నిరంతర నిఘా ఉంచాలి

కుమురం భీమ్ ఆసిఫాబాద్, నవంబర్‌ 16 (ప్రజానేస్తం జ్వాల): కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నితికా పంత్, ఐపీఎస్ కెరమెరి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని వివిధ రికార్డులు, పెండింగ్ కేసుల వివరాలు, కేసుల దర్యాప్తు పురోగతి, స్టేషన్ నిర్వహణ తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో సిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని ఎస్పీ సూచించారు. వారి సమస్యలను ఓపికగా విని, చట్ట పరిధిలో సత్వర పరిష్కారం లభించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పెండింగ్ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించి, దర్యాప్తును వేగవంతం చేయాలని, బాధితులకు న్యాయం జరిగేలా బాధ్యతగా విధులు నిర్వర్తించాలని తెలిపారు.

జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గుడుంబా తయారీ, విక్రయాలు, పేకాట, బెట్టింగ్, గంజాయి విక్రయాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా వంటి అసాంఘిక కార్యకలాపాలపై నిరంతర నిఘా కొనసాగించాలని, అనుమానిత ప్రాంతాల్లో క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని అధికారులకు, సిబ్బందికి ఆదేశించారు. గ్రామస్థాయిలో ప్రజలకు పోలీసులపై నమ్మకం, విశ్వాసం పెంపొందించేలా కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని అన్నారు. విజిబుల్ పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేసి, ప్రజలకు పోలీసుల ఉనికి స్పష్టంగా కనిపించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, సిబ్బంది క్రమశిక్షణ, సమయపాలన పాటిస్తూ విధుల పట్ల పూర్తి బాధ్యతతో వ్యవహరించాలని ఎస్పీ తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యానికి తావులేకుండా ప్రజలకు నాణ్యమైన పోలీస్ సేవలు అందించాలని స్పష్టం చేశారు. ఈ ఆకస్మిక తనిఖీలో పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
🏠 Home