🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 17 November 2026, 8:00 am Posted by : Praja Nestham Jwala News

ప్రజావాణి అర్జీలను త్వరగా పరిష్కరించాలి: ఆసిఫాబాద్ కలెక్టర్

News Image
ఆసిఫాబాద్, నవంబర్‌ 17 (ప్రజానేస్తం జ్వాల): ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ హరిత అధికారులను ఆదేశించారు. సోమవారం ఆసిఫాబాద్ కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజలు తమ వినతులను అధికారులకు సమర్పించారు. ఈ సందర్భంగా వృద్ధాప్య పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు, భూ సమస్యలు, ఉపాధి కల్పన, పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై అర్జీలు అందాయి. ప్రతి అర్జీని సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.

ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి రాకుండా నిర్ణీత గడువులోగా అర్జీలను పరిష్కరించాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా పిల్లల ప్రజావాణిలో వచ్చిన అర్జీలను కూడా పెండింగ్‌లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు.
🏠 Home