🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 17 November 2026, 7:58 am Posted by : Marelli kiran

కలెక్టరేట్ల ఎదుట ఆశా వర్కర్ల ఆందోళన.. కనీస వేతనం రూ.18 వేలు చెల్లించాలని డిమాండ్

News Image
హనుమకొండ, నవంబర్ 16 (ప్రజానేస్తం జ్వాల): తమ దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హనుమకొండ, వరంగల్ జిల్లాలకు చెందిన ఆశా వర్కర్లు కలెక్టరేట్ల ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీఐటీయూ (CITU) ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనలో ఆశా వర్కర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ డిమాండ్లను పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్ల నాయకులు మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. ఆశా వర్కర్లకు నెలకు కనీస వేతనం రూ.18 వేలు చెల్లించాలని, పని భారాన్ని తగ్గించి తమ సమస్యలను పరిష్కరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు.

ప్రజారోగ్య సేవల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఆశా వర్కర్ల సమస్యలను ప్రభుత్వం గుర్తించి తక్షణమే స్పందించాలని వారు కోరారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు ఆందోళనలను విరమించేది లేదని, అవసరమైతే దశలవారీగా నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తామని హెచ్చరించారు.
🏠 Home