🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 17 November 2026, 7:54 am Posted by : Marelli kiran

ఎనుమాముల మార్కెట్ బంద్ విరమణ.. రేపటి నుంచి యథాతథంగా పంటల కొనుగోళ్లు!

News Image
హనుమకొండ, నవంబర్ 16, 2026 (ప్రజానేస్తం జ్వాల): వరంగల్‌లోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో వ్యాపారులు చేపట్టిన బంద్‌కు తెరపడింది. మంగళవారం నుంచి మార్కెట్‌లో అన్ని రకాల క్రయవిక్రయాలు, పంటల కొనుగోళ్లు యథావిధిగా కొనసాగనున్నాయని మార్కెట్ అధికారులు ప్రకటించారు. దీంతో మార్కెట్‌కు పంటలు తీసుకువచ్చే రైతులకు ఊరట లభించింది. ఇటీవల మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శికి, లింగారెడ్డి అనే వ్యాపారికి మధ్య జరిగిన వాగ్వాదం, ఆ తర్వాత పోలీసు కేసు నమోదు కావడంతో వ్యాపారులు నిరసనకు దిగారు. ఈ క్రమంలో సోమవారం మార్కెట్‌లో కొనుగోళ్లను నిలిపివేసి బంద్ పాటించారు.

అయితే మార్కెట్ బంద్ కొనసాగితే రైతులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని భావించిన వ్యాపార సంఘం నాయకులు ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని బంద్‌ను విరమించాలని నిర్ణయించారు. మంగళవారం నుంచి మార్కెట్‌లో కొనుగోళ్లు, క్రయవిక్రయాలు యథావిధిగా నిర్వహిస్తామని ప్రకటించారు. బంద్ విరమణతో మార్కెట్ కార్యకలాపాలు తిరిగి ప్రారంభం కానుండటంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు.
🏠 Home