పదో తరగతి విద్యార్థులకు ఊరట.. ఎస్ఎస్‌సీ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు
హనుమకొండ, నవంబర్ 16 (ప్రజానేస్తం జ్వాల): వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించనున్న ఎస్ఎస్‌సీ (SSC), ఓఎస్ఎస్‌సీ (OSSC), ఒకేషనల్ పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును తెలంగాణ ప్రభుత్వ పరీక్షల విభాగం పొడిగించింది. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఈ నెల 26వ తేదీ వరకు విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించింది. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు చెల్లించిన పరీక్ష ఫీజును పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సైబర్ ట్రెజరీ ద్వారా ఆన్‌లైన్‌లో జమ చేసేందుకు ఈ నెల 27వ తేదీ వరకు గడువు ఇచ్చింది.
గడువులోగా ఫీజు చెల్లించలేని విద్యార్థులకు ఆలస్య రుసుముతో మరికొంత సమయం కల్పించారు. రూ.50 ఆలస్య రుసుముతో డిసెంబర్ 8వ తేదీ వరకు, రూ.200 ఆలస్య రుసుముతో డిసెంబర్ 21వ తేదీ వరకు, రూ.500 ఆలస్య రుసుముతో వచ్చే ఏడాది జనవరి 4వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చని అధికారులు స్పష్టం చేశారు. పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ గడువులను గమనించి వీలైనంత త్వరగా పరీక్ష ఫీజు చెల్లించాలని అధికారులు సూచించారు. చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే ఫీజు చెల్లించి ఇబ్బందులు నివారించుకోవాలని తెలిపారు.