నిరుపేదల సొంతింటి కలను నిజం చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం
సూర్యాపేట, నవంబర్ 16 (ప్రజానేస్తం జ్వాల): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం నిరుపేద కుటుంబాల జీవితాల్లో కొత్త ఆశలు నింపుతోంది. ప్రతి పేద కుటుంబానికి సొంతింటి చిరునామా కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం గృహ నిర్మాణానికి ఆర్థిక సహాయం అందిస్తోంది. ఈ పథకం ద్వారా సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు అర్హులైన లబ్ధిదారులకు అవకాశం కల్పిస్తోంది. సొంత ఇల్లు అనేది ప్రతి పేద కుటుంబం జీవితకాల స్వప్నం. ఆ కలను నిజం చేసే దిశగా ఇందిరమ్మ ప్రభుత్వం అందిస్తున్న సహకారం అభినందనీయమని సూర్యాపేట జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడు, సర్పంచ్ రామాంజిగౌడ్ పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇల్లు కేవలం నాలుగు గోడల నిర్మాణం మాత్రమే కాదని, పేద కుటుంబాలకు ఆత్మగౌరవం, భద్రత, భవిష్యత్తుపై భరోసా కల్పించే సొంత గూడు అని అన్నారు.
ఈ సందర్భంగా లబ్ధిదారుడి ఇంటి నిర్మాణానికి ముగ్గు పోసి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. నిరుపేదల ఆశలను నిజం చేస్తూ, వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్న తెలంగాణ ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ యోగి, గ్రామ కార్యదర్శి సునీత, మెంబర్లు గుండు ఉష, నరసింహ, గుండు లక్ష్మమ్మ, గురవయ్య, లబ్ధిదారులు పగిల్ల ఎలేంద్ర, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.