హనుమకొండలో నేపాలీ–టిబెటన్ వూలెన్ మార్కెట్ ప్రారంభం
హనుమకొండ, నవంబర్ 16 (ప్రజానేస్తం జ్వాల): హనుమకొండలో ఏర్పాటు చేసిన నేపాలీ–టిబెటన్ వూలెన్ మార్కెట్‌ను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, రిబ్బన్ కట్ చేశారు. అనంతరం టిబెటన్ మహిళలు ప్రదర్శించిన సంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి.
మార్కెట్‌లోని దుకాణాలను సందర్శించి వ్యాపారులతో మాట్లాడిన నాయకులు, ప్రతి సంవత్సరం హనుమకొండకు వచ్చి వస్త్ర వ్యాపారం నిర్వహిస్తున్న టిబెటన్ వ్యాపారులకు ప్రజలు అండగా నిలిచి ఆదరించాలని కోరారు. మార్కెట్‌లో స్వెటర్లు, శాలువాలు, జాకెట్లు, టోపీలు, మఫ్లర్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.