బాలాజీనగర్‌లో వైభవంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ద్వితీయ వార్షికోత్సవం
మల్కాజ్‌గిరి, నవంబర్ 16 (ప్రజానేస్తం జ్వాల): మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జవహర్ నగర్ డివిజన్ బాలాజీనగర్‌లో కొలువుదీరిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి అభిషేకాలు, కుంకుమార్చన, ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. ఆలయాన్ని పూలతో అలంకరించగా, ఆర్యవైశ్య సంఘం సభ్యులు, స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు.
వేడుకల్లో మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ గుప్తా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో బాలాజీనగర్‌లోని ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఆలయ వార్షికోత్సవాలు కేవలం ఒక వర్గానికి సంబంధించినవి కాకుండా గ్రామమంతా కలిసి జరుపుకునే ఆధ్యాత్మిక వేడుకలని పేర్కొన్నారు. ఆలయ అభివృద్ధికి, భక్తుల సౌకర్యాల కల్పనకు తనవంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలతో పాటు అన్నప్రసాద వితరణ చేపట్టారు.
ఈ కార్యక్రమంలో మారగొని వెంకటేష్ గౌడ్, చిరంజీ రవీందర్ గుప్తా, ఉడుత సంతోష్ గుప్తా, హరీష్ గుప్తా, బల్లి చంద్రమౌళి, బుస్స సంతోష్ గుప్తా, ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, మహిళా భక్తులు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.