కలం ఎవరికీ బానిస కాకూడదు!
జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా...
మీరు చెప్పిందే రాయాలనే షరతులు వద్దు..
మీకు నచ్చిందే చూపాలనే ఆంక్షలు వద్దు..
మీ భజన చేయలేదని నిందలు వేయకండి..
నిజాన్ని నిర్భయంగా రాసే స్వేచ్ఛను హరించకండి!
పత్రిక అంటే కేవలం కాగితాల కట్ట కాదు..
ప్రజల గుండెల్లో దాగిన ఆవేదనకు అక్షరరూపం,
బాధితుల కన్నీటికి గొంతుక,
అధికారుల తప్పిదాలకు ప్రశ్నార్థకం!
పదవుల ముందు తలవంచని కలం కావాలి..
పేదవాడి కన్నీటిని అక్షరాల్లో పలికించాలి..
మంచి చేసే మనిషికి అండగా నిలవాలి..
మారుమూల పల్లెల మూగవేదనను వెలుగులోకి తేవాలి..
అన్యాయం ఎక్కడ జరిగినా అక్షరంతో ఎదిరించాలి!
అయితే స్వేచ్ఛ ఉందని ఇష్టారాజ్యంగా రాయకండి..
ఎదుటివారి స్వేచ్ఛను కించపరిచేలా వ్యవహరించకండి..
ఆతృతతో రాసే ఒక్క అబద్ధపు వార్త
ఒక జీవితాన్నే ఆగం చేయవచ్చని మరువకండి!
ఆలస్యమైనా పర్వాలేదు..
అసత్యం మాత్రం అక్షరమవ్వకూడదు..
ఒక మంచి వార్త రాయకపోయినా పర్వాలేదు..
కానీ మంచిని చెడుగా చిత్రించడం
కలం బానిస కాకూడదు!
పత్రికా స్వేచ్ఛ అంటే
అది సమాజం అప్పగించిన పవిత్రమైన బాధ్యత..
జర్నలిస్టు కలం ఎవరికీ కిరీటం పెట్టడానికి కాదు..
ఎవరి కాళ్ల దగ్గరో మోకరిల్లడానికి అంతకన్నా కాదు..
నిజం వైపు నిలబడి న్యాయం కోసం నినదించడానికి!
కలాన్ని కత్తిగా కాదు.. కాంతిగా మలచండి!
అక్షరాన్ని అస్త్రంగా కాదు.. ఆలోచనగా మలచండి!
మంచికి అండగా.. చెడుకు ఎదురుగా..
న్యాయం కోసం నిరంతరం నడిచే కలమే కావాలి!
జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా...
– తాళ్లపెళ్లి సురేందర్