🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 15 November 2026, 10:50 pm Posted by : Nagilla Rajinikanth

ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా వనభోజనాలు

News Image
భీమదేవరపల్లి, నవంబర్ 15 (ప్రజా నేస్తం జ్వాల): ఆర్యవైశ్యులంతా ఐకమత్యంతో ఉంటూ సంఘం బలోపేతానికి కృషి చేయాలని, పేదలకు సేవ చేయడంలో ముందుండాలని జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు తోట సురేష్ పిలుపునిచ్చారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కొమురవెల్లి చంద్రశేఖర్ గుప్తా ఆధ్వర్యంలో ఆదివారం అశోక్ ముఖర్జీ తోటలో వనభోజనాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తోట సురేష్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం సభ్యులు కుటుంబ సమేతంగా పాల్గొని ఉత్సాహంగా గడిపారు. ఆటపాటలు, వివిధ వినోద కార్యక్రమాలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో వనభోజనాలను ఆనందంగా జరుపుకున్నారు. ఇలాంటి కార్యక్రమాలు సంఘ సభ్యుల మధ్య స్నేహసంబంధాలను పెంపొందించడంతో పాటు ఐక్యతను మరింత బలోపేతం చేస్తాయని పలువురు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం సభ్యుడు చికిలం రాజేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షుడు మునీందర్, మండల గౌరవ అధ్యక్షుడు అంచూరి సదానందం, కార్యదర్శులు అంచూరి వెంకటరాజు, బల్లు రమేష్, భూపతి విజయ్, పెద్ది సూర్యప్రకాష్, చొల్లేటి ప్రకాశం తదితరులు పాల్గొన్నారు.
🏠 Home