తిర్యాణిలో 41 క్వింటాళ్ల రేషన్ బియ్యం మాయం?
తిర్యాణి, నవంబర్ 15 (ప్రజానేస్తం జ్వాల): తిర్యాణి మండలం గిన్నెదారి గ్రామంలోని చౌక ధరల దుకాణంలో 41 క్వింటాళ్ల రేషన్ బియ్యం మాయమైనట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. స్టాక్ వచ్చినప్పటి నుంచి సేల్స్‌మెన్ ఏదో ఒక కారణం చెబుతూ లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దుకాణంలో బియ్యం నిల్వలు ఉన్నప్పటికీ పంపిణీ చేయకపోవడంపై గ్రామస్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు విచారణ చేపట్టినట్లు సమాచారం. విచారణలో 41 క్వింటాళ్ల బియ్యం నిల్వలకు సంబంధించి వాస్తవాలు వెలుగులోకి వస్తాయా? బియ్యం పంపిణీలో అక్రమాలు జరిగినట్లు తేలితే బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది చర్చనీయాంశంగా మారింది. అధికారులు సమగ్ర విచారణ జరిపి, రేషన్ బియ్యం పంపిణీలో పారదర్శకత కల్పించాలని గ్రామస్థులు కోరుతున్నారు.