రాజ్యాంగ పరిరక్షణ కమిటీ అధ్యక్షుడిగా మాచర్ల సదానందం
భీమదేవరపల్లి, నవంబర్ 15 (ప్రజా నేస్తం జ్వాల): రాజ్యాంగ విలువల పరిరక్షణ, ప్రజల్లో రాజ్యాంగంపై అవగాహన కల్పించడం, హక్కుల సాధన కోసం సంఘటితంగా పనిచేయడం లక్ష్యంగా భీమదేవరపల్లి గ్రామ రాజ్యాంగ పరిరక్షణ కమిటీ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఆదివారం పచ్చూనూరి కరుణాకర్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో కమిటీ గ్రామ అధ్యక్షుడిగా మాచర్ల సదానంద గౌడ్‌ను, ప్రధాన కార్యదర్శిగా సయ్యద్ ఫజల్‌ను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ రాజ్యాంగ పరిరక్షణకు కృషి చేస్తామని, ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కులు, బాధ్యతలపై అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం రాష్ట్ర నాయకుడు చెప్యాల ప్రకాష్, ఉప్పుల కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.