శబరిమల నుంచి నేరుగా ఇంటికే అయ్యప్ప ప్రసాదం
హనుమకొండ, నవంబర్ 15 (ప్రజానేస్తం జ్వాల): శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం ఇండియా పోస్ట్, ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు సంయుక్తంగా ప్రత్యేక పోస్టల్ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నాయి. దర్శనం అనంతరం భక్తులు ప్రసాదాలను తమ వెంట తీసుకెళ్లే ఇబ్బందులు లేకుండా, శబరిమల సన్నిధానం నుంచే నేరుగా వారి ఇళ్లకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నాయి.
ప్రసాదాలను ప్రత్యేకంగా బుక్ చేసుకునే అవకాశం కల్పించనున్నారు. భక్తులు అందించిన చిరునామాలకు ఇండియా పోస్ట్ ద్వారా ప్రసాదాలను పంపించనున్నారు. శబరిమల సన్నిధానంలోని ప్రత్యేక కౌంటర్‌లో భక్తులు తమ చిరునామా నమోదు చేసి ఈ సేవలను వినియోగించుకోవచ్చు. నవంబర్ 17 నుంచి ప్రారంభం కానున్న 41 రోజుల మండల-మకరవిళక్కు యాత్రా సీజన్ నేపథ్యంలో ఈ ప్రత్యేక సేవలు భక్తులకు అందుబాటులోకి రానున్నాయి. రద్దీ సమయంలో ప్రసాదాలను వెంట తీసుకెళ్లే ఇబ్బందులు లేకుండా ఇంటి వద్దకే చేరవేయడం ఈ సేవల ప్రధాన ఉద్దేశం.