🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 15 November 2026, 10:45 pm Posted by : Marelli kiran

హమాలీలతో కలిసి వడ్ల బస్తా మోసిన కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి

News Image
హనుమకొండ, నవంబర్ 15 (ప్రజానేస్తం జ్వాల): విధి నిర్వహణలో నిత్యం బిజీగా ఉండే ఓ పోలీసు అధికారి శ్రమజీవులతో కలిసి పనిచేస్తూ తనలోని మానవత్వాన్ని చాటుకున్నారు. హనుమకొండ జిల్లా వేలేరు మండలం మల్లికుదుర్ల గ్రామంలో రోడ్డుపై ధాన్యాన్ని ట్రాక్టర్‌లోకి ఎక్కిస్తున్న హమాలీలను కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి గమనించారు. వెంటనే వాహనం దిగి హమాలీల వద్దకు వెళ్లి వారిని ఆప్యాయంగా పలకరించారు. వారి పని విధానం, ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం హమాలీలతో కలిసి స్వయంగా ధాన్యం బస్తాను భుజంపైకి ఎత్తుకుని మోశారు. రోజూ హమాలీలు ఎంతటి శ్రమతో బరువైన బస్తాలను మోస్తున్నారో ప్రత్యక్షంగా తెలుసుకునే ప్రయత్నం చేశారు.

ఏసీపీ ప్రశాంత్ రెడ్డి స్వయంగా వడ్ల బస్తా మోస్తున్న దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ ఘటన స్థానికుల దృష్టిని ఆకర్షించడంతో పాటు నెటిజన్ల నుంచి స్పందన పొందుతోంది.
🏠 Home