ఈ నెల 22న కేడీసీ మైదానంలో కేటీఆర్ బహిరంగ సభ
హనుమకొండ, నవంబర్ 15 (ప్రజానేస్తం జ్వాల): ఈ నెల 22వ తేదీన హనుమకొండలోని కేడీసీ (KDC) మైదానంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొననున్న బహిరంగ సభ నిర్వహణకు అనుమతి కోరుతూ పార్టీ నాయకులు పోలీసు అధికారులను కలిశారు. మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్‌వీ కాకతీయ యూనివర్సిటీ అధ్యక్షుడు బైరపాక ప్రశాంత్, యువ నాయకుడు తక్కెళ్లపల్లి వినీల్ రావు హనుమకొండ ఏసీపీ నరసింహారావును కలిసి సభ నిర్వహణకు సంబంధించిన అనుమతి దరఖాస్తును అందజేశారు. ఈ సందర్భంగా సభకు విద్యార్థులు, యువకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉన్నందున తగిన భద్రతా ఏర్పాట్లు చేయడంతో పాటు ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను కోరారు.