🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 15 November 2026, 10:44 pm Posted by : Marelli kiran

వరంగల్ కోటలో సర్వాయి పాపన్న స్మారక శిల్పం గుర్తింపు

News Image
హనుమకొండ, నవంబర్ 15 (ప్రజానేస్తం జ్వాల): చారిత్రక వరంగల్ కోటలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్‌కు సంబంధించినదిగా భావిస్తున్న అరుదైన స్మారక శిల్పాన్ని కొత్త తెలంగాణ చరిత్ర బృందం గుర్తించింది. వరంగల్ పడమర కోట పశ్చిమ ద్వారం వద్ద ఉన్న ఈ శిల్పాన్ని బృందం అధ్యక్షుడు శ్రీరామోజు హరగోపాల్ పరిశోధించి సర్వాయి పాపన్న స్మారక శిల్పంగా గుర్తించినట్లు వెల్లడించారు.

శిల్పంలో వీరుడి కుడిచేతిలో కైజారు, ఎడమచేతిలో మస్కట్ తుపాకీ, నడుముకు కత్తి ఉండటం విశేషం. 17వ శతాబ్దానికి చెందినదిగా భావిస్తున్న ఈ శిల్పాన్ని స్థానికులు ఇంతకాలం దేవతా విగ్రహంగా భావిస్తూ పూజలు నిర్వహిస్తున్నారు. చారిత్రక ఆధారాల ప్రకారం 1708లో సర్వాయి పాపన్న వరంగల్ కోటపై దాడి చేసిన ఘటనకు గుర్తుగా ఈ స్మారక శిల్పాన్ని ఏర్పాటు చేసినట్లు హరగోపాల్ వెల్లడించారు. ఈ గుర్తింపుతో తెలంగాణ చరిత్రలోని మరో ముఖ్యమైన ఘట్టానికి సంబంధించిన ఆధారం వెలుగులోకి వచ్చినట్లయిందని చరిత్ర పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.
🏠 Home