కలెక్టర్ పేరుతో నకిలీ వాట్సాప్ ఖాతాలు.. డబ్బులు పంపవద్దని హెచ్చరిక
భూపాలపల్లి, నవంబర్ 15 (ప్రజానేస్తం జ్వాల): జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పేరు, ఫొటోను దుర్వినియోగం చేస్తూ సైబర్ నేరగాళ్లు నకిలీ వాట్సాప్ ఖాతాల ద్వారా డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. కలెక్టర్ పేరుతో జిల్లా అధికారులు, సిబ్బందితో పాటు సామాన్య ప్రజలకు సందేశాలు పంపుతూ అత్యవసరంగా నగదు బదిలీ చేయాలని కోరుతున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో ప్రజలు, ప్రభుత్వ అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు.
ముఖ్యంగా 97398 11309 నంబర్ నుంచి తన పేరు, ఫొటోను ఉపయోగించి డబ్బులు పంపాలంటూ సందేశాలు వస్తున్నాయని కలెక్టర్ తెలిపారు. ఈ నంబర్‌తో పాటు తన పేరుతో ఇతర అనుమానాస్పద నంబర్ల నుంచి సందేశాలు వచ్చినా స్పందించవద్దని, ఎట్టి పరిస్థితుల్లోనూ నగదు బదిలీ చేయవద్దని హెచ్చరించారు.
ఈ వ్యవహారంపై ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. నకిలీ వాట్సాప్ సందేశాలు వచ్చిన వెంటనే సంబంధిత నంబర్‌ను బ్లాక్ చేసి, పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఆర్థిక అభ్యర్థనలను నమ్మవద్దని, వ్యక్తిగత వివరాలు, బ్యాంకు ఖాతా సమాచారం, ఓటీపీలు వంటి రహస్య సమాచారాన్ని ఎవరికీ వెల్లడించవద్దని ప్రజలు, అధికారులు, సిబ్బందికి విజ్ఞప్తి చేశారు.