ప్రతి ధాన్యపు గింజకు మద్దతు ధర అందించడమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే గండ్ర
భూపాలపల్లి, నవంబర్ 15 (ప్రజానేస్తం జ్వాల): రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యానికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర అందించడమే ప్రభుత్వ లక్ష్యమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు. ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం బుర్రకాయలగూడెం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా, సజావుగా నిర్వహించాలని సూచించారు. ముఖ్యంగా ధాన్యం తేమ శాతం పరిశీలన, నాణ్యత ప్రమాణాలు, తూకం విషయంలో నిబంధనలను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. తూకంలో కోతల పేరుతో లేదా ఇతర కారణాలతో రైతుల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడితే సహించేది లేదని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను హెచ్చరించారు. దళారులను నమ్మి మోసపోకుండా రైతులందరూ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.