🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 15 November 2026, 10:39 pm Posted by : Praja Nestham Jwala News

జవహర్ నగర్ డివిజన్‌లో కాలనీల సమస్యలను తెలుసుకున్న శాంతి కోటేష్ గౌడ్

News Image
జవహర్ నగర్, నవంబర్ 15 (ప్రజా నేస్తం జ్వాల): జవహర్ నగర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లో మాజీ మేయర్, కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షురాలు దొంతగాని శాంతి కోటేష్ గౌడ్ పర్యటించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాలనీవాసులతో కలిసి స్థానికంగా నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కాలనీల్లోని సీసీ రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సరఫరా, వీధి దీపాలు, పారిశుద్ధ్యం తదితర మౌలిక వసతుల సమస్యలపై స్థానికులతో చర్చించారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకుని, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ప్రతి కాలనీలో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని శాంతి కోటేష్ గౌడ్ తెలిపారు. ప్రజలు తెలిపిన సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు.
🏠 Home