రైతులు, వ్యవసాయ కార్మికుల హక్కుల పరిరక్షణకు ఐక్యంగా పోరాడాలి: బృందా కారత్
నల్లగొండ, నవంబర్ 15 (ప్రజానేస్తం జ్వాల): నల్లగొండలోని ఎన్జీ కళాశాల ప్రాంగణం 36వ అఖిల భారత కిసాన్ సభ మహాసభలకు వేదికైంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి రైతులు, వ్యవసాయ కార్మికులు, రైతు సంఘాల ప్రతినిధులు, ఎర్రజెండా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో మాజీ ఎంపీ బృందా కారత్ ప్రసంగిస్తూ రైతులు, వ్యవసాయ కార్మికులు, గ్రామీణ పేదల హక్కుల పరిరక్షణకు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్రను మతతత్వ రాజకీయాలకు ఆపాదించే ప్రయత్నాలను తిప్పికొట్టాలని ఆమె అన్నారు. నిజాం పాలన, భూస్వామ్య దోపిడీ, వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా సాగిన తెలంగాణ రైతాంగ పోరాటం చారిత్రకమైనదని పేర్కొన్నారు. ఈ పోరాటం హిందూ, ముస్లింల మధ్య జరిగినది కాదని, భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా సాగిన లౌకిక పోరాటమని వివరించారు. దున్నేవాడికే భూమి దక్కాలనే లక్ష్యంతో సాగిన ఉద్యమంలో వేలాది మంది ప్రాణత్యాగం చేశారని గుర్తుచేశారు. దొడ్డి కొమరయ్య, చాకలి ఐలమ్మ, పుచ్చలపల్లి సుందరయ్య, మల్లు స్వరాజ్యం వంటి నాయకుల సేవలను ప్రస్తావించారు.
కిసాన్ సభ తొమ్మిది దశాబ్దాలుగా రైతులు, వ్యవసాయ కార్మికులు, గ్రామీణ పేదల హక్కుల కోసం పోరాడుతోందని బృందా కారత్ తెలిపారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా వ్యవసాయ విధానాలు రూపొందిస్తోందని విమర్శించారు. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిర్వహించిన ఉద్యమం కారణంగా కేంద్ర ప్రభుత్వం ఆ చట్టాలను వెనక్కి తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందం దేశీయ రైతాంగ ప్రయోజనాలకు విఘాతం కలిగించే ప్రమాదం ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. రైతులతో చర్చించకుండా వాణిజ్య ఒప్పందాలపై ముందుకు వెళ్లడం సరికాదని, రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉండే ఒప్పందాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో రేషన్ దుకాణాల ద్వారా బియ్యం, పప్పులు, నూనెలను సబ్సిడీపై అందించాలని కోరారు.
దేశంలో వ్యవసాయ సంక్షోభం తీవ్రంగా ఉందని, రైతుల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. గత 12 ఏళ్లలో దేశవ్యాప్తంగా లక్షన్నర వ్యవసాయ సంబంధిత ఆత్మహత్యలు నమోదయ్యాయని సభలో వెల్లడించారు. కరువు, వరదలు, పంట నష్టాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు పూర్తిస్థాయిలో పరిహారం అందించాలని, పంటల బీమా పథకంలో బీమా కంపెనీల లాభాపేక్షను నియంత్రించాలని అన్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల మేరకు పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలని, డీజిల్ ధరలను నియంత్రించి వ్యవసాయ పెట్టుబడి భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు.
విద్యుత్ ప్రైవేటీకరణను నిలిపివేయాలని, స్మార్ట్ మీటర్ల పేరుతో రైతులపై అదనపు భారం మోపవద్దని కోరారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని బలోపేతం చేసి గ్రామీణ పేదలు, భూమిలేని కూలీలకు నిరంతర ఉపాధి కల్పించాలని సూచించారు. దేశంలో భూమి పంపిణీలో అసమానతలు కొనసాగుతున్నాయని పేర్కొంటూ భూగరిష్ట పరిమితి చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని, భూమిలేని పేదలకు సాగుభూమి పంపిణీ చేసి సమగ్ర భూసంస్కరణలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అప్పుల భారంతో భూములు కోల్పోతున్న చిన్న, సన్నకారు రైతులను ఆదుకోవాలని కోరారు. వ్యవసాయ పనుల్లో కీలక పాత్ర పోషిస్తున్న మహిళలకు రైతులుగా గుర్తింపు కల్పించాలని బృందా కారత్ అన్నారు. మహిళలను కుటుంబ సహాయకులుగా మాత్రమే చూడకుండా స్వతంత్ర రైతులుగా గుర్తించి, భూమిపై హక్కులు, ప్రభుత్వ పథకాల్లో సమాన ప్రాధాన్యత కల్పించాలని కోరారు.
అభివృద్ధి ప్రాజెక్టుల పేరుతో రైతులను నిర్వాసితులను చేయడం సరికాదని, 2013 భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు న్యాయమైన పరిహారం అందించాలని అన్నారు. ఆదివాసీల జల్, జంగిల్, జమీన్ హక్కులను పరిరక్షించాలని, అటవీ హక్కుల చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసి పోడు సాగుదారులకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆదివాసీలను ఆక్రమణదారులుగా పరిగణించి తొలగింపులకు పాల్పడవద్దని, గ్రామసభల అధికారాలను గౌరవించాలని కోరారు. రైతులు, వ్యవసాయ కార్మికులు, గ్రామీణ పేదల సమస్యల పరిష్కారం కోసం సంఘటితంగా ఉద్యమించాలని ఆమె పిలుపునిచ్చారు. కార్పొరేట్ అనుకూల వ్యవసాయ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమాలను బలోపేతం చేయాలని పేర్కొన్నారు.