🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 15 November 2026, 10:34 pm Posted by : Nagaraju Golla

అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పింఛన్లు అందించడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యం

News Image
నూతన చేయూత పింఛన్ల మంజూరు పత్రాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి

నడికూడ, నవంబర్ 15 (ప్రజానేస్తం జ్వాల): అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. అర్హులైన పేదలు, నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. ఆదివారం నడికూడ మండల కేంద్రంలోని ఎంఆర్సీ భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో మండల పరిధిలో నూతనంగా మంజూరైన చేయూత పింఛన్ల మంజూరు పత్రాలను ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, నేత కార్మికులు, గీత కార్మికులకు ప్రభుత్వం మంజూరు చేసిన పింఛన్ల పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సమాజంలోని అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందాలన్నదే ప్రభుత్వ సంకల్పమని తెలిపారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు చేయూత పింఛన్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని, ప్రభుత్వం కల్పిస్తున్న ఈ ఆర్థిక భరోసాను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందించడంలో ఎలాంటి వివక్షకు తావులేకుండా ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
🏠 Home