అయోధ్య–జనక్‌పూర్ మధ్య కొత్త వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు
హనుమకొండ, 15 నవంబర్ 2026 (ప్రజానేస్తం జ్వాల): ఆధ్యాత్మిక పర్యాటకులకు భారతీయ రైల్వే కొత్త రైలు సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. శ్రీరాముడి జన్మస్థలమైన ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య, సీతాదేవి జన్మస్థలంగా ప్రసిద్ధి చెందిన నేపాల్‌లోని జనక్‌పూర్ ధామ్‌లను అనుసంధానిస్తూ ఈ నెల 23వ తేదీ నుంచి వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలును నడపనున్నట్లు ప్రకటించింది. సుమారు 604 కిలోమీటర్ల దూరం ప్రయాణించే ఈ రైలు ప్రతి శనివారం జనక్‌పూర్ ధామ్ నుంచి బయలుదేరుతుంది. తిరుగు ప్రయాణంలో ప్రతి సోమవారం అయోధ్య నుంచి జనక్‌పూర్ ధామ్‌కు బయలుదేరుతుంది. ఈ రైలు ద్వారా రెండు దేశాల్లోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శించాలనుకునే భక్తులకు ప్రయాణ సౌకర్యం కలగనుంది.
ప్రయాణ మార్గంలో అయోధ్య ధామ్, మన్కాపూర్, బస్తీ, గోరఖ్‌పూర్, నర్కటియాగంజ్, రక్సౌల్, సీతామర్హి, షిషో, మధుబని, జైనగర్ తదితర స్టేషన్లలో రైలు ఆగనుంది. ఈ రైలు సేవలు ప్రారంభమైతే భారత్, నేపాల్ మధ్య ఆధ్యాత్మిక పర్యాటకానికి మరింత ప్రోత్సాహం లభించనుంది.