కొండగట్టు అంజన్న నిజరూప దర్శనానికి వేళాయె!
* నేటి నుంచి ఐదు రోజుల పాటు చందనం తొలగింపు ప్రక్రియ..
* ఈ నెల 21 నుంచి భక్తులకు నిజరూప దర్శనం
కొండగట్టు, నవంబర్ 15 (ప్రజానేస్తం జ్వాల): ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో భక్తులు ఎంతగానో ఎదురుచూస్తున్న అంజన్న నిజరూప దర్శనానికి సమయం ఆసన్నమైంది. స్వామివారి మూలవిరాట్‌పై సుమారు 61 ఏళ్లుగా పేరుకుపోయిన చందనాన్ని తొలగించే ప్రత్యేక ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఐదు రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని ఆలయ సంప్రదాయాలు, ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం నిర్వహించనున్నారు. చందనం తొలగింపు ప్రక్రియ పూర్తయిన అనంతరం ఈ నెల 21వ తేదీ నుంచి డిసెంబర్ 29వ తేదీ వరకు భక్తులకు స్వామివారి నిజరూప దర్శనానికి అవకాశం కల్పించనున్నారు. ఈ అరుదైన దర్శనం కోసం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు కొండగట్టుకు తరలివచ్చే అవకాశం ఉంది.
సుమారు 61 ఏళ్ల క్రితం కూడా ఇదే తరహాలో స్వామివారి విగ్రహంపై ఉన్న చందనాన్ని తొలగించి భక్తులకు నిజరూప దర్శనం కల్పించారు. అప్పటి కార్యక్రమంలో భాగస్వాములైన అర్చకుల్లో ప్రస్తుతం ముగ్గురు మాత్రమే జీవించి ఉండటం ఈ ఘట్టం ప్రత్యేకతను చాటుతోంది. దశాబ్దాల తర్వాత మరోసారి అంజన్న నిజరూప దర్శనానికి అవకాశం లభిస్తుండటంతో భక్తుల్లో భక్తిభావం, ఆసక్తి నెలకొన్నాయి.